అక్షరశక్తి, వరంగల్: టెన్నికాయిట్ పోటీలకు ఉమ్మడి వరంగల్ జిల్లా గురుకుల పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు ఎంపికయ్యారు. శనివారం జేఎన్ఎస్ స్టేడియంలో జరిగిన పోటీలకు వరంగల్ జిల్లా నుండి నలుగురు బాలికలు, నలుగు నలుగురు బాలురు ఎంపికైనట్లు టెన్నికాయిట్ అసోసియేషన్ ఎంపిక చేసినట్లు అధ్యక్షులు అధ్యక్ష కార్యదర్శులు గోకారపు శ్యాం కుమార్, అల్వాల రాజ్ కుమార్‌లు తెలిపారు. ఈ పోటీలో గెలిచిన విద్యార్థిని విద్యార్థులను రేపు జరిగే నిజామాబాద్ సెవెంత్ సబ్ జూనియర్ ఇంటర్ డిస్టిక్ టోర్నమెంట్స్ లో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిడి శ్రీనివాస్, కమల, కుమారి, సరిత, కావేరి, నిర్మల, నరసయ్య, శ్రీధర్, ప్రకాష్, కౌశికులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.