అక్షరశక్తి, వరంగల్: భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ వరంగల్ ఆదేశాల మేరకు వరంగల్ తహసీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు మహమ్మద్ ఇక్బాల్ తహసీల్దార్ వరంగల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అదే విధంగా వరంగల్ మండలంలో ముంపు ప్రాంతాలు అయినటువంటి ఏనుమాముల, శ్రీ నగర్, బాలాజీ నగర్, చాకలి ఐలమ్మ నగర్, హంటర్ రోడ్ ప్రాంతంలోని సాయినగర్, ఎన్టీఆర్ నగర్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏదైనా అత్యవసర పరిస్థితిలో వరంగల్ కలెక్టర్ కంట్రోల్ రూమ్ టోల్ ప్రీ నెంబర్ 18004253424 గాని తహసీల్దార్ వరంగల్ కంట్రోల్ రూమ్ నెంబర్ 701362828, 9948225160 గాని వివరాలు తెలియపరచాలని విజ్ఞప్తి చేసారు.