Thursday, September 19, 2024

పెండింగ్ భూ సమస్యల పరిష్కారానికి పటిష్ట చర్యలు-సిసిఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్

Must Read

అక్ష‌ర‌శ‌క్తి, హనుమకొండ, ఆగస్టు 3 : ఆర్వోర్ నూతన ముసాయిదా బిల్లు పై అభిప్రాయాలు ఆగస్టు 23 వరకు సమర్పించాలని సిసిఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ అన్నారు. పెండింగ్ భూ సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల పై జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు తహసిల్దారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన సీసీఎల్ఏ కమిషనర్ మాట్లాడారు. జిల్లాలో పెండింగ్ భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని నవీన్ మిట్టల్ సి.సి.ఎల్.ఏ తెలిపారు. శనివారం హైదరాబాద్ సీసీఎల్ఏ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో పెండింగ్ భూ సమస్యల పరిష్కారం పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రివ్యూ నిర్వహించారు. జిల్లాలో ఇప్పటి వరకు పెండింగ్ ధరణి దరఖాస్తుల పరిష్కారానికి తీసుకున్న చర్యల పై జిల్లాల వారీగా అడిగి తెలుసుకున్నారు. రికార్డులు పరిశీలించి క్షేత్రస్థాయిలో విచారణ చేసిన తర్వాత సంబంధిత దరఖాస్తుల ఆన్ లైన్ లో అప్ డేట్ చేసి పరిష్కరించాలని అన్నారు.
నవీన్ మిట్టల్ సి.సి.ఎల్.ఏ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న పెండింగ్ భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, నూతన ఆర్వోఆర్ చట్టం ముసాయిదా బిల్లును రూపొందించి ప్రజలకు అందుబాటులో ఆన్లైన్ లో పెట్టిందని అన్నారు.నూతన చట్టం ముసాయిదా క్రింద సెక్షన్ 4 ప్రకారం కొత్త ఆర్వోర్ రికార్డ్ రూపకల్పన, అందుబాటులో ఉన్న రికార్డ్ సవరణకు అవకాశం ఉందని, గత చట్టం కింద నిలిచిపోయిన సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి సెక్షన్ 6 వెసులుబాటు కల్పించిందని, సిసిఎల్ఏ వెబ్ సైట్ నందు ముసాయిదా బిల్లు అందుబాటులో ఉందని అన్నారు. ఆర్వోఆర్ ముసాయిదా బిల్లు పై ప్రజలు తమ సలహాలు సందేహాలు, అభిప్రాయాలను సిసిఎల్ఏ వెబ్ సైట్ www.ccla.telangana.gov.in ద్వారా లేదా ror-rev@telangana.gov.in మెయిల్ ద్వారా ఆగస్టు 23 వరకు తెలియజేయాలని ఆయన తెలిపారు.
రాష్ట్రంలోని అదనపు కలెక్టర్లు, రెవెన్యూ డివిజన్ అధికారులు నూతన ఆర్వోఆర్ చట్టం ముసాయిదా బిల్లును పరిశీలించి, క్షేత్రస్థాయిలో ఉన్న భూ సమస్యల పరిష్కారానికి అవసరమైన సలహాలు సూచనలు సకాలంలో అందజేయాలని సీ.సీ.ఎల్.ఏ కమిషనర్ సూచించారు. ప్రజల నుండి వచ్చిన సూచనలు సలహాలు మేరకు కొత్త చట్టాన్ని ప్రభుత్వం రూపొందిస్తుందని సీసీఎల్ఏ కమిషనర్ తెలిపారు.
నూతన ఆర్వోఆర్ చట్టం అమలులోకి వచ్చే లోపు పెండింగ్ ధరణి దరఖాస్తులను పరిష్కరించాలని, మరో 3 వారాల వ్యవధిలో పూర్తి స్థాయిలో ధరణి దరఖాస్తులు పరిష్కారమయ్యే విధంగా అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని ఆయన ఆదేశించారు. ధరణి ద్వారా వచ్చిన దరఖాస్తులను తిరస్కరించే పక్షంలో తప్పనిసరిగా కారణాలను తెలియజేయాలని అధికారులకు సూచించారు.
వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ హనుమకొండ జిల్లాలో ధరణి ద్వారా మొత్తం 38261 దరఖాస్తులు వచ్చాయని, వాటిలో ఇప్పటివరకు 19649 దరఖాస్తులను ఆమోదించామని 14187 దరఖాస్తులను తిరస్కరించడం జరిగిందని, ప్రస్తుతం 5314 ధరణి దరఖాస్తులు వివిధ స్థాయిలో పెండింగ్ లో ఉన్నాయని, వీటిని సకాలంలో పరిష్కరిస్తామని తెలిపారు. అనంతరం కలెక్టర్ జిల్లాలో ప్రభుత్వ భూములు, భవనాలు వివరాల పూర్తి నివేదిక అందించాలని అధికారులకు సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, ఆర్డిఓలు, మండలాల నుండి తహసిల్దార్ లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img