అక్షరశక్తి, పరకాల: కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పేద ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. పరకాల నియోజకవర్గంలోని అనారోగ్యానికి గురై చికిత్స పొందిన పరకాల టౌన్, పరకాల, నడికూడ మండలాలలోని వివిధ గ్రామాలకు చెందిన 100 మంది లబ్ధిదారులకు 19లక్షల 57వేల 900రూపాయల విలువగల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను, ఆరుగురు లబ్ధిదారులకు 6లక్షల 696 రూపాయల విలువగల కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పరకాల పట్టణ కేంద్రంలోనీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ… నిరుపేదలకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు.