Tuesday, September 10, 2024

పుష్ప పాటకు స్టెప్పులేసిన కోహ్లీ

Must Read

మ్యాక్స్వెల్ పెళ్లి పార్టీలో విరాట్ హంగామా

స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి పుష్ప పాట‌కు స్టెప్పులేశాడు. ఊ.. అంటావా మావ‌… ఉఊ అంటావా.. పాట‌కు డాన్స్ చేశాడు. కొంతకాలంగా బ్యాటింగ్ లో విఫలమవుతూ తీవ్ర విమర్శల పాలవుతున్న విరాట్ కోహ్లి కాస్త సేద తీరాడు. గత నెల పెళ్లి చేసుకున్న ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్-వినీ రామన్ ల వివాహ పార్టీలో కోహ్లి కాలు కదిపాడు. ఈ పార్టీకి ఆర్సీబీ ఆటగాళ్లంతా హాజరయ్యారు. గత నెల 27న ఆస్ట్రేలియా భారత సంతతి వినీ రామన్-మ్యాక్స్వెల్ ల వివాహం అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే. పెళ్లి ముగిసిన వెంటనే ఏప్రిల్ 6న మ్యాక్సీ ఇండియాకు వచ్చాడు. ఐపీఎల్ లో తన జట్టుతో చేరి మ్యాచులు కూడా ఆడుతున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వరుస వైఫల్యాలు ఎదురవుతున్న కోహ్లి మాత్రం ముఖం పై చెరగని చిరునవ్వుతో సంతోషంగా కనిపించాడు.

కాగా బయో బబుల్ లో ఉన్న ఆర్సీబీ ఆటగాళ్లు కాసింత రిఫ్రెష్ అవడానికి ఆ జట్టు యాజమాన్యం మ్యాక్సీ పెళ్లి పార్టీని ఏర్పాటు చేసింది. రెండ్రోజుల క్రితం రాజస్తాన్ తో మ్యాచ్ ఆడిన ఆ జట్టు.. ఈనెల 30 దాకా ఖాళీ దొరకింది. దీంతో ఆటగాళ్లు కాసింత సేద తీరడానికి ఈ పార్టీ ఉపయోగపడుతుందని ఆ జట్టు యాజమాన్యం భావించింది. ఇక ఈ పార్టీకి విరాట్ కోహ్లి, అనుష్క శర్మ, ఫాఫ్ డుప్లెసిస్ అతడి భార్య, వనిందు హసరంగ, రూథర్ఫర్డ్, దినేశ్ కార్తీక్ వంటి ఆటగాళ్లు హాజరయ్యారు. ఈ మేరకు వాళ్లు సోషల్ మీడియాలో తమ ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. ఈ వేడుక కోసం ఆర్సీబీ ఆటగాళ్లంతా సంప్రదాయ భారతీయ దుస్తుల్లో రావడం విశేషం.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img