Thursday, September 19, 2024

మేజర్ ధ్యాన్ చంద్ స్ఫూర్తితో యువత ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాలు సాదించాలి- వరంగల్ కలెక్టర్

Must Read

అక్ష‌ర‌శ‌క్తి వ‌రంగ‌ల్: హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ జన్మదినం సందర్భంగా వరంగల్ పట్టంలోని వెంకట్రామ కూడలి నుండి ఓ సిటీ మైదానం వరకు నిర్వహించిన జాతీయ క్రీడోత్సవ ర్యాలీను గురువారం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా జెండా ఊపి ప్రారంభించారు. క్రీడాకారులతో కలెక్టర్ పరిచయం చేసుకొని, క్రీడాకారులచే నిర్వహించిన జూడో, కరాటే, రెస్లింగ్ ప్రదర్శనలను కలెక్టర్ ప‌రిశీలించి అభినందించారు. అలాగే కలెక్టర్ క్రీడాకారులతో కలసి కాసేపు సరదాగా కబడ్డీ క్రికెట్ ఆడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భారత హాకీ మాంత్రికుడు మేజర్‌ ధ్యానచంద్‌ జయంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ జిల్లా క్రీడల శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు ఏర్పాటు చేయడం హర్షణీయమని అన్నారు. విద్యార్థులు చిన్నతనం నుంచే చదువుతో పాటు క్రీడల్లో రాణించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు. క్రీడలు విద్యార్థులకు శారీరక, మానసిక ఆరోగ్యం దృఢంగా ఉండేందుకు సహకరిస్తాయని, అలాగే క్రీడలు రోజువారీ జీవితంలో భాగంగా ఉండాలన్నారు. మేజర్ ధ్యాన్ చంద్ స్ఫూర్తితో యువత హాకీ వంటి క్రీడల్లో ప్రావీణ్యం సాధించాలన్నారు. ఒలింపిక్స్ లో 4 సార్లు స్వర్ణ పతకాలు గెలిచిన ధ్యాన్ చంద్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని క్రీడల్లో ప్రతిభ కనబర్చాలన్నారు. అంతేకాకుండా క్రీడల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులు ప్రొఫెషనల్ ప్లేయర్స్ గా ఎదిగి, ఒలింపిక్స్ కు దేశానికి ప్రాతినిధ్యం వహించాలని ఆకాంక్షించారు. అనంతరం ఓ సిటీ స్టేడియంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వివిధ క్రీడల్లో గెలుపొందిన క్రీడాకారులకు కోచ్ లు, ఫిజికల్ డైరెక్టర్లను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి సత్యవాణి, జాతీయ యువజన అవార్డ్ గ్రహీత పరశురాములు, కొచ్‌లు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img