Thursday, September 19, 2024

ఇస్రో యంగ్ స్టూడెంట్ సైంటిస్టు నిఖిల్‌వ‌ర్మకు అండ‌గా ఎన్ఎఫ్‌హెచ్‌సీ ఫౌండేషన్

Must Read
  • పై చ‌దువుల‌కు ఆర్థిక సాయం అందించిన దాత వి.ర‌మేష్

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : జై విజ్ఞాన్ – జై భార‌త్ నినాదంతో సీడాట్ సైంటిస్టు ముడావ‌త్ మోహ‌న్ నేతృత్వంలో ముందుకు వెళ్తున్న నేష‌న్స్ ఫ‌స్ట్ హ్యూమ‌న్ చైన్ ఫౌండేష‌న్ – ఇండియా సంస్థ ప్ర‌తిభ‌గ‌ల పేద విద్యార్థికి చేయూత‌నిచ్చింది. ఆ విద్యార్థి పై చ‌దువుల‌కు అవ‌స‌ర‌మైన సాయం అందించేందుకు ముందుకు వ‌చ్చింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న‌ ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా ప‌ర్వ‌త‌గిరి మండ‌లం బ‌ట్టు తండాకు చెందిన ఇస్రో యంగ్ స్టూడెంట్ సైంటిస్టు నిఖిల్‌వ‌ర్మ ఐఏటీ కోచింగ్ కోసం ఫౌండేషన్ దాత వి.రమేష్ ఆర్థిక సాయం అందించారు. నేషన్స్ ఫస్ట్ హ్యూమన్ చైన్ ఫౌండేషన్ ఇండియా – మిషన్ విద్య విజ్ఞాన్ సేవలో భాగంగా హ‌న్మ‌కొండ‌లో విద్యార్థి నిఖిల్‌ను క‌లిసి ఈ స‌హ‌కారం అందించిన‌ట్లు దాత వి.రమేష్, ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి జె.జయకృష్ణ (ఐఐటి రోపార్) తెలిపారు.

దాత ర‌మేష్‌ను స‌న్మానిస్తున్న ఫౌండేష‌న్ ప్ర‌తినిధులు

ఈ సంద‌ర్భంగా ఫౌండేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి జయకృష్ణ మాట్లాడుడుతూ… ప్రతిభ గల పేద విద్యార్థి నిఖిల్ గురించి టీచ‌ర్ ముడుసు న‌ర్స‌య్య‌, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు ముల్క‌ రవి తమ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సైంటిస్టు మోహన్‌కు తెలియజేసారని, అన్ని పరిశీలించిన తర్వాత నిఖిల్‌కు దాత వి.రమేష్ సాయం అందించార‌ని తెలిపారు. అలాగే భవిష్యత్తులో ఇంకా విజయాలు సాధించాలని, నిఖిల్‌కు అండగా ఫౌండేషన్ ఉంటుందని, విద్యార్ధికి కావాల్సిన సహకారం ఒక తమ్ముడిగా దాత వి.రమేష్ చూసుకుంటారని అని మీటింగ్‌లో తెలియజేయడం హ‌ర్ష‌ణీయ‌మ‌ని అన్నారు. అనంత‌రం పేద విద్యార్థుల మేలు కోసం ప్రతి సంవత్సరం ఆర్థిక‌ సహకారం చేస్తున్న దాత వి.రమేష్‌కు ఫౌండేషన్ సభ్యులు ఘనంగా సన్మానం చేసారు. ఈ సంద‌ర్భంగా నిఖిల్ మాట్లాడుతూ… ఫౌండేషన్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. తన వంతు తోటి వారికి సహాయం చేస్తానని, దేశాభివృద్ధిలో తన వంతు ఫౌండేషన్ తో కలిసి పని చేస్తానని తెలియజేసారు. పేద విద్యార్థులు తమ డౌట్స్, గైడెన్స్ సహకారం కోసం తమ ఫౌండేషన్ వాట్సాప్ హెల్ప్ లైన్ నెంబర్ 78927 82387 కు సంప్రదించాల్సిందిగా ఫౌండేష‌న్ ప్ర‌తినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి కుటుంబ సభ్యులు, ఫౌండేషన్ వ‌లంటీర్లు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img