Monday, September 9, 2024

ప్ర‌చారంలో దూసుకుపోతున్న మంద న‌రేష్‌

Must Read

 

  • వ‌రంగ‌ల్ పార్ల‌మెంట్ స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా బ‌రిలోకి..
  • ప‌లు విద్యార్థి, ప్ర‌జా సంఘాల మ‌ద్ద‌తు..
  • ఉద్య‌మ‌కారుడిగా, సామాజిక సేవ‌కుడిగా గుర్తింపు
  • ద‌శాబ్ధ‌కాలంగా విద్యారంగ స‌మ‌స్య‌ల‌పై రాజీలేని పోరు
  • బ‌హుజ‌న రాజ్యాధికార‌మే ల‌క్ష్యంగా అడుగులు
  • కూల‌ర్ గుర్తుకు ఓటేసి గెలిపించాలంటూ విజ్ఞ‌ప్తి
  • పేదింటి బిడ్డ‌ను ఆశీర్వ‌దించాలంటూ వేడుకోలు

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్‌: వ‌రంగ‌ల్ పార్ల‌మెంట్ స్థానం నుంచి స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా బ‌రిలో దిగిన కాక‌తీయ యూనివ‌ర్సిటీ విద్యార్థి ఉద్య‌మ నేత మంద న‌రేష్ ప్ర‌చారంలో దూసుకుపోతున్నారు. ప‌లు విద్యార్థి, ప్ర‌జా సంఘాల మ‌ద్ద‌తుతో పార్ల‌మెంట్ ప‌రిధిలోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో విస్తృతంగా ప‌ర్య‌టిస్తున్నారు. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌తో మ‌మేకమ‌వుతూ ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. కేయూ విద్యార్థి నేత‌గా, ఏబీఎస్ఎఫ్ ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా అధ్య‌క్షుడిగా మంద న‌రేష్ ద‌శాబ్ధ‌కాలంగా అనేక ఉద్య‌మాలు చేప‌ట్టారు. నిర్భంధాల‌ను ఛేదిస్తూ విద్యారంగ స‌మ‌స్య‌ల‌పై ప్ర‌భుత్వాల‌కు వ్య‌తిరేకంగా పోరాటాలు చేశారు. అంబేద్క‌ర్‌, కాన్షీరాం, పూలేను ఆద‌ర్శంగా తీసుకుని బ‌హుజ‌న జెండాను భుజాన‌మోస్తున్నారు. కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌, బీజేపీతో సామాన్యుల‌కు న్యాయం జ‌ర‌గ‌ద‌ని, పేదింటి బిడ్డ‌నైన త‌న‌కు ఒక్క అవ‌కాశం క‌ల్పించాల‌ని కోరుతున్నారు. కూల‌ర్ గుర్తుకు ఓటేసి ఎంపీగా గెలిపిస్తే అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉంటాన‌ని విన్న‌విస్తున్నారు. ప్ర‌ధాన పార్టీల‌కు ధీటుగా త‌న‌దైన శైలితో ఓట‌ర్ల‌ను ప్ర‌స‌న్నం చేసుకునేందుకు న‌రేష్ తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు.

బ‌హుజ‌న రాజ్యాధికార‌మే ల‌క్ష్యంగా..

హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పెద్ద కోడెపాక గ్రామానికి చెందిన మంద నరేష్ విద్యార్థి దశ నుంచే బహుజనవాదాన్ని భుజానికి ఎత్తుకున్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. 15 సంవత్సరాలుగా నీలి జెండాను భుజాన మోస్తూ విద్యార్థి ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారు. ఏబీఎస్‌ఎఫ్ (అంబేద్కర్ స్టూడెంట్ ఫెడరేషన్)ను ఉమ్మడి వరంగల్ జిల్లాలో బలోపేతం చేయడంలో నరేష్ తీవ్రంగా కృషి చేశారు. వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా విద్యారంగ సమస్యలపై నిత్యం గళ‌మెత్తుతున్నారు. కాకతీయ యూనివర్సిటీ కేంద్రంగా నడిచిన తె లంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. ఉద్యమ సమయంలో అనేక కేసులు, నిర్బంధాలు ఎదురైనప్పటికీ ఉద్యమబాట వీడలేదు. పరకాల, భూపాలపల్లి ప్రాంతంలో తెలంగాణ ఉద్యమవ్యాప్తికి తన వంతు కృషి చేశారు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం మంద నరేష్ జిల్లాలో అనేక పోరాటాలు చేపట్టారు. నిరంతరం విద్యార్థుల పక్షాన నిలబడిన న‌రేష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కలెక్టరేట్ల ముట్టడి, నిరాహార దీక్షలు, ధర్నాలు, రాస్తారోకలు నిర్వహించారు.

సామాజిక సేవ‌లో ముందంజ‌..

పదో తరగతి వరకు పెద్ద కోడెపాక‌లో చదివిన నరేష్ ఇంటర్, డిగ్రీ పరకాలలో పూర్తి చేశారు. హనుమకొండ లోని మాస్టర్ జీ కాలేజీలో మొదటి పీజీ పూర్తి చేసి కాకతీయ యూనివర్సిటీలోకి అడుగుపెట్టి చదువుతోపాటు విద్యార్థి ఉద్యమాన్ని బలంగా నడిపిస్తున్నారు. మరోపక్క సొంత గ్రామంలో వ్యవసాయం చేసుకుంటున్నారు. కరోనా సమయంలో జిల్లాలో పేదలకు ఉచితంగా ప్రతిరోజు భోజనాలు అందించారు. అదేవిధంగా మొన్నటి వర్షాలకు దెబ్బతిన్న మోరంచ, కొండాయి గ్రామాల్లో నిర్వాసితులకు అండగా నిలబడ్డారు. బాధితుల‌కు 10 క్వింటాళ్ల బియ్యంతోపాటు దుప్పట్లు, నిత్యావసర సరుకులు పంపిణీ చేసి మానవత్వం చాటుకున్నారు. అన్ని వర్గాల విద్యార్థులకు తనవంతుగా సహకారం అందిస్తున్నారు. అంబేద్కర్, పూలే, కాన్షీరామ్ ఆశయ సాధన కోసం ఉద్యమిస్తున్న నరేష్ పార్లమెంటు ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగి అదృష్టం పరీక్షించుకుంటున్నారు. వరంగల్ ప్రజలు, విద్యార్థులు, నిరుద్యోగులు, యువకులు, మేధావులు త‌న‌కు మద్దతు ప్రకటించాల‌ని నరేష్ కోరుతున్నారు.

 

 

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img