సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు
అక్షరశక్తి, హనుమకొండ : కలకత్తా నగరంలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ పై అత్యాచారం చేసి, హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. హన్మకొండలోని కాళోజీ సెంటర్లో సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో తక్కళ్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడారు. అత్యాచార నిందితులను గుర్తించి వారికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని కోరారు. దేశంలో మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలన్నారు. వైద్య విద్యార్థిని కుటుంబాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మహిళలపై దాడులకు పాల్పడుతున్న వారిని శిక్షించుటకు ప్రత్యేక చట్టాలు రూపొందించాలని అయన కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, సీపీఐ జిల్లా మాజీ కార్యదర్శి సిరబోయిన కరుణాకర్, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి మద్దెల ఎల్లేష్, మండల కార్యదర్శి యేశబోయిన శ్రీనివాస్, నాయకులు వేల్పుల సారంగపాణి, మునిగాల భిక్షపతి, కోట్టెపాక రవి, కండె నర్సయ్య, సుదర్శన్, పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు.
Must Read