అక్షరశక్తి,కాజీపేట: దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని కాజీపేట భారత్ స్కౌట్స్ మరియు గైడ్స్ కు చెందిన బక్క లలిత రీజినల్ ఆర్గనేషన్ కమీషనర్‌గా ఎంపికైనారు. దీనిలో భాగంగా ఆరు నెలలు దేశ రాజధాని ఢిల్లీలో శిక్షణ పొందనున్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. దక్షిణ భారత దేశం నుండి ఎంపికైన ప్రథమ యువతి ఆర్ఓసీగా ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అలాగే నాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన ట్రైనింగ్ కమిషనర్ లకు అర్గనేషన్ కమిషనర్ లకు ప్రతి ఒక్కరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు.