అక్షరశక్తి, పర్వతగిరి: కల్లేడ వనిత అచ్యుతపాయ్ జూనియర్ కళాశాల పూర్వ విద్యార్ధిని జీవంజి దీప్తి ప్యారిస్ లో జరిగే పారా ఒలింపిక్స్ లో బాలికల విభాగంలో 400 మీ.ల పరుగు పందెంలో పాల్గొనబోతున్న సందర్భంగా కళాశాల విద్యార్థినీ, విద్యార్థులు మరియు అధ్యాపక బృందం జీవంజి దీప్తి విజయం సాధించి దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఆడెపు జనార్ధన్, వైస్ ప్రిన్సిపల్ రాజు మరియు అధ్యాపక బృందం పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించాలనుకునేవారు ప్యారిస్ లో సోమవారం రాత్రి 8:30 గంటలకు అనగా భారత కాలమానం ప్రకారం 11:40 గంటలకు jeo cinema, DD sports, గూగుల్ లో olympics.com, యూట్యూబ్ లో Paralympics ఛానల్ లో చూడవచ్చు అని తెలిపారు.