అక్షరశక్తి మహబూబాబాద్: ఇల్లందు నియోజకవర్గ కొత్తపేట స్టేజ్ వద్ద స్థానిక శాసన సభ్యులు కోరం కనకయ్య, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ లు పర్యటించగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రాయల ముత్తయ్య అనే వికలాంగుడు మోటర్ సైకిల్ ఇవ్వాలని కోరగా.. వెంటనే స్పందించి కలెక్టర్ తో మాట్లాడి మోటర్ సైకిల్ ఇప్పిస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం బలరాం నాయక్ ని పలువురు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా సన్మానించారు.