Monday, September 16, 2024

ఎంజీఎం ఆసుపత్రిని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

Must Read

రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని ఆదేశం

అక్ష‌ర‌శ‌క్తి, వరంగల్, 16 ఆగస్టు 2024 : ఎంజీఎం ఆసుపత్రిలో రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ డా. సత్య శారద వైద్యాధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎంజీఎం ప్రభుత్వ ఆసుపత్రి తో పాటు ఎంజీఎంకు అనుబంధంగా కొనసాగుతున్న కాకతీయ మెడికల్ కళాశాల ప్రాంగణంలో గల పి ఎం ఎస్ ఎస్ వై ఆసుపత్రులను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి రోగులకు అందిస్తున్న సేవలు పరిశీలించారు. ఈ నందర్బంగా ఆసుపత్రిలోని అన్ని విభాగాలను కలెక్టర్ కలియతిరిగి ఓపి సేవలు, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లను పరిశీలించారు. ఓ పి లో అందుతున్న సేవలను పరిశీలించి అందిస్తున్న వైద్యం గురించి నేరుగా రోగులను అడిగి తెలుసుకున్నారు. ఫార్మసీ లో ఔషధాల పంపిణీ రికార్డులను తనిఖీ చేసిన కలెక్టర్ ప్రతి ఔషధం ఈ ఔషధీ ప్రకారం ఉండాలన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో కుక్కకాటుకు నర్సు తీసుకెళుతున్న అంటి రాబిస్ మందుల గడువు తేదీలను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం వైరల్ జ్వరాలు ఆసుపత్రిలో ఎంత మంది వ్యాధి గ్రస్థుల వివరాలను ఆరా తీశారు. ఆసుపత్రిలో ప్రజలకు అందుతున్న వివిధ రకాల వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కొన్ని ముఖ్యమైన పరికరాలు అందుబాటులో లేవని తమ దృష్టికి వచ్చిందని, వాటిని టిజీఎమ్ఐడిసి ద్వారా తెప్పించి ఏర్పాటు చేయడం జరుగుతుందని, ప్యారసిటమాల్ క్లోరోఫిన్ డెంగ్యూ వ్యాధి ప్లేట్ లేట్స్ కు సంబంధించిన మందులు తగిన మోతాదులోనే అందుబాటు లో ఉన్నాయని, అసంక్రమిత వ్యాధులైన బిపి గుండె సంబంధిత వ్యాధుల కు సంబంధించి మందులు వెంటనే టిజీఎమ్ఐడిసి నుండి తెప్పించే ఏర్పాట్లు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎం జిఎం సూపరింటెండెంట్ డాక్టర్ చిలుకమురళి, ఆర్ఎంఓలు మురళి, రోషన్, తహసీల్దార్ మహ్మద్ ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img