అక్షరశక్తి, జనగాం: జనగాం జిల్లా స్టేషన్ ఘనపూర్ విద్యుత్ శాఖలో డివిజనల్ ఇంజనీయర్ గా విధులు నిర్వహిస్తున్న మాలోత్ హుస్సేన్ నాయక్ 20వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు. కుంభం ఎల్లయ్య అనే రైతు 33 కేవీ లైన్ షిఫ్టింగ్ కొరకు 16 లక్షల డిడి కట్టినాడు. అప్పడి నుంచి రెండు నెలలు అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగిన కొర్రీలు పెట్టి డీఈ హుస్సేన్ నాయక్ 20,000 లంచం అడిగారు. రైతు నుండి 20,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. గతంలోను వరంగల్, హన్మకొండలో విద్యుత్ కార్యాలయంలో పనిచేస్తున్న సమయంలో హుస్సేన్ నాయక్ పై అనేక అవినీతి ఆరోపణలు వుండటం గమనార్హం.