అక్షరశక్తి హనుమకొండ: వర్ధమాన రచయిత, సీనియర్ జర్నలిస్ట్ గడ్డం కేశవమూర్తిని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అభినందించారు. బుధవారం హనుమకొండ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాకు చెందిన రచయితలతో గవర్నర్ బేటి అయ్యారు. మధ్యాహ్నం వారితోనే కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టుగా పనిచేస్తూ.. రచయితగా రాణిస్తున్న కేశవమూర్తి సేవలను ఆయన ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి సీతక్క, గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్ర వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.