అక్షరశక్తి, హనుమకొండ: హనుమకొండ: హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఆదివారం జరిగిన ఓరుగల్లు ఎలక్ట్రానిక్స్ టెక్నీషియన్ యూనియన్ ఎన్నికలలో అధ్యక్షులుగా వూకంటి మహేందర్, కార్యదర్శిగా దుప్పెటి శ్రీనివాస్, కోశాధికారిగా పాలడుగుల లక్ష్మణ కాంత్‌ని సభ్యులు అందరూ కలిసి ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎలక్ట్రానిక్ టెక్నీషియన్లు పాల్గొన్నారు. సమన్వయకర్తగా బిక్కుమల్ల రవి ప్రసాద్, ఎన్నికల అధికారులుగా పిట్ట రాజేష్, సత్యనారాయణ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు ఎడీ. అమ్‌జద్, మాజీ కమిటీ సభ్యులు బలబద్ర మురళి, వనం సాగర్, ఏ. రవీందర్ కుమార్, కన్నబోయిన హరికృష్ణ, దాసి శోభన్, రామ్మోహన్, భాస్కర్ రెడ్డి, సదానందం, గోలనుకొండ మురళి, సామల ప్రకాష్, తాటిపాముల శ్రీనివాస్, వాడికారి రాజు మరియు ఉమ్మడి జిల్లాలోని టెక్నీషియన్లు పాల్గొని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మహేందర్ మాట్లాడుతూ.. టెక్నీషియన్లకు ఎప్పుడు అందుబాటులో ఉండి వాళ్లకు అవసరమైన సేవలు అందిస్తానని తెలియజేశారు..