Tuesday, September 10, 2024

మహబూబాబాద్ జిల్లాలో పర్యటించిన మంత్రి సీతక్క

Must Read

అక్ష‌ర‌శ‌క్తి, మహబూబాబాద్: ఈరోజు నెల్లికుదుర్ మండల కేంద్రంలోని రావిరాల గ్రామంలో విస్తృతంగా వరద బాధితులను పరామర్శిస్తూ పర్యటించిన మంత్రివర్యుల దనసరి సీతక్క. జిల్లా వ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతుండడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ఆస్తినష్టం జరగకుండా ఎప్పటికప్పుడు అధికారులు సమన్యాయం చేసి సహాయక చర్యల్లో పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవాలని ఎవ్వరు ఫోన్ చేసినా సరే వెంటనే స్పందించాలని, అందరూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ముందుగా పోలీస్ శాఖ వారు, రెవెన్యూ శాఖ వారు, ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూ లోతట్టుగా ఉన్నటువంటి ప్రాంతాలకు చెందిన గ్రామాలకు హెచ్చరికలు జారీ చేసి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా పోలీస్ శాఖ చర్యలు చేపట్టాలని కోరారు. ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా, అధికార యంత్రాంగాన్ని ముమ్మరం చేయాలని కలెక్టర్, అద్వైత్ కుమార్ సింగ్‌కి, మంత్రి సీతక్క, ఎమ్మెల్యే ముర‌ళి నాయ‌క్‌, ఎంపీ బ‌ల‌రాం నాయ‌క్‌ సిఫారసు చేశారు. మంత్రి సీతక్క, ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రావిరల చెరువు ప్రవాహానికి దగ్గరగా ఉండడంతో చెరువుకట్ట తెగి ఊరు ఊరు నీటి ఉధృతికి చిన్న భిన్నం కావడంతో ఇళ్లలోకి నీరు చేరడంతో పాటు ట్రాక్టర్లు మోటార్ సైకిల్, ఆడి గేదెలు గొర్లు యొక్క ప్రవాహానికి కొట్టుకుపోయాయని అక్కడున్నటువంటి ప్రజలు ఎమ్మెల్యేతో మంత్రితో వాపోయార‌ని తెలిపారు. నీటిలో మునిగిన తండాను సందర్శించి ప్రజల వద్దకు చేరుకొని తండా ప్రాంతం మొత్తం తిరిగి వాళ్ళ యొక్క బాగోగులను అడిగి తెలుసుకుని అధైర్య పడద్దని వారి వెంట ప్రభుత్వం ఎప్పుడూ ఉంటుందని వారికి ఉండడానికి స్థావరాన్ని కల్పిస్తామని నిత్యవసర సరుకులను పంపిణీ చేస్తామని తర్వాత గతిలో వారికి ఇండ్లను మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకుంటానని భరోసాని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు, దనసరి సీతక్క, మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్యా మురళి నాయక్, ఎంపీ బలరాం నాయక్, జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ సుధీర్‌ రామ్నాథ్, పలు శాఖలకు సంబంధించిన అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img