Tuesday, September 10, 2024

వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

Must Read

అక్ష‌ర‌శక్తి, వరంగ‌ల్: వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కాజీపేట వెంకటరమణ కరీమాబాద్ హైస్కూల్ నందు నిర్వహిస్తున్న పునరావాస కేంద్రాన్ని మరియు ఖిలా వరంగల్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నమోదైన డెంగ్యూ వ్యాధిగ్రస్తుని ఇంటిని సందర్శించి పలు సూచనలు చేశారు.
ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నందున కరీమాబాద్ హై స్కూల్ నందు నిర్వహిస్తున్న పునరావాస కేంద్రాన్ని సందర్శించి అక్కడ ఉన్న పునరావాసితులకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించి మందులను పంపిణీ చేశారు. అదేవిధంగా ఖీలా వరంగల్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నమోదైన డెంగ్యూ వ్యాధిగ్రస్తుని ఇంటిని క్షేత్ర స్థాయిలో పరిశీలించి వ్యాధిగ్రస్తుని ఆరోగ్యం పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని సందర్శించి వైద్య సిబ్బంది విధుల పట్ల అప్రమత్తంగా ఉండి ఇంటింటి జ్వర సర్వే చేపట్టి మందులు పంపిణీ చేయాలని, సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. అదేవిధంగా మున్సిపల్ శాఖ వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆంటీ లార్వెల్ ఆపరేషన్ మరియు పైరిత్రం స్ప్రే ను పరిశీలించి నీరు నిల్వ ఉన్న ప్రాంతాలలో ఆయిల్ బాల్స్ వేయాలని, సాయంత్రం ఫాగింగ్ చేయించాలని సూచించారు. అదేవిధంగా ప్రజలు నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు భుజించకుండా పరిశుభ్రమైన వేడి ఆహారాన్ని తీసుకోవాలని మరియు కాచి చల్లార్చి వడబోసిన నీటినే తాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఆర్ ఆర్ తోట మెడికల్ ఆఫీసర్ అనిత, డిప్యూటీ డెమో అనిల్ కుమార్, ఇన్చార్జ్ ఏ ఎం ఓ మాడిశెట్టి శ్రీనివాస్, సబ్ యూనిట్ ఆఫీసర్ విజయేంద్ర కుమార్, సూపర్వైజర్ సదానందం మరియు ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు తదితర వైద్య సిబ్బంది మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img