అక్షరశక్తి, కొత్తగూడ : మహబూబాద్ జిల్లా కొత్తగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ అనసూయ సీతక్క ఆదేశాల మేరకు సీతక్క ఫౌండేషన్ చైర్మన్ కుంజ కుసుమాంజలి సూర్య మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వి రమేష్ ఎండి, డాక్టర్ నవీన్ రెడ్డి, డాక్టర్ వి శ్రవణ్, బిఎఎంఎస్ వైద్యులచే 1500 మంది పేషెంట్స్ ఓపి విభాగం వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య, నాయకులు చల్ల నారాయణరెడ్డి, సుంకరబోయిన మొగిలి, బానోత్ రూఫ్సింగ్, గుమ్మడి సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.