Tuesday, September 10, 2024

వాటర్ ట్యాంకుల‌ నిర్మాణనికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

Must Read

అక్షరశక్తి, భూపాలపల్లి: భూపాలపల్లి పట్టణవాసుల దాహార్తి తీర్చేందుకు అమృత్ పథకం 2.0 ద్వారా రూ.18.99 కోట్లతో ఓహెచ్ఎస్ఆర్ వాటర్ ట్యాంకుల నిర్మాణానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు శంకుస్థాపన చేశారు. ముందుగా, మంజూర్‌నగర్ లోని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో సుమారు 1200కేల్ సామర్థ్యంతో నూతనంగా నిర్మించనున్న వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులకు కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం బీసీ కాలనీ గ్రీన్ ల్యాండ్ ఏరియాలో 800కేఎల్ కెపాజిటీతో నూతనంగా నిర్మించనున్న వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం కారల్ మార్క్స్ కాలనీలో 1100కేఎల్‌ కెపాసిటీతో నూతనంగా నిర్మించే వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రోజురోజుకు భూపాలపల్లి పట్టణం విస్తరిస్తున్న నేపథ్యంలో, భవిష్యత్తులో పట్టణ వాసులకు త్రాగునీటి కష్టాలను తీర్చేందుకు అమృత్ పథకం 2.0 కింద రూ.18.99 కోట్లు మంజూరు అయినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ నిధులతో భూపాలపల్లి పట్టణంలో మూడు చోట్ల నూతన ఓహెచ్ఎస్ఆర్ వాటర్ ట్యాంకుల నిర్మాణంతోపాటు, పైపులైన్ల నిర్మాణం, ఇతర పనులు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ నాయకులు పట్టణ అధ్యక్షులు ఇస్లావత్ దేవన్,కురిమిళ్ళ శ్రీనివాస్,బుర్ర కొమురయ్య, ముంజల రవీందర్, అజ్మీరా తిరుపతి నాయక్,దాట్ల శ్రీనివాస్,కప్పల రాజేష్, చల్లా రేణుక తదితరులు ఉన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img