అక్షరశక్తి, పర్వతగిరి : వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం వడ్లకొండలో శుక్రవారం డ్రై డే కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీవో మాలోతు శంకర్ నాయక్ అతిథిగా హాజరై మాట్లాడారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీవో సుశీల్ కుమార్, పంచాయతీ కార్యదర్శి సునీల్, ఈసీ రాజు, ఆశ కార్యకర్త వల్లందాస్ లక్ష్మి పాల్గొన్నారు.