అక్షరశక్తి, జనగామ: జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ రైల్వే స్టేషన్‌లో గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్న మహారాష్ట్రకు చెందిన మనోహర్ బాగ్వా పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. 7 కిలోల 100 గ్రాములు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు లక్ష 77 వేల 500 వందలు ఉంటుందని మీడియా సమావేశంలో జనగామ వెస్ట్ జోన్ డిసిపి రాజామహేంద్ర నాయక్ వెల్లడించారు.