అక్షరశక్తి, వరంగల్: రాబోవు వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ట్రై సిటీ పరిధిలో ఏర్పాటు చేసే గణేష్ మండపాలను ఏర్పాటు చేయడంలో నిర్వాహకులు సన్నద్ధం అవుతుందడంతో సెంట్రల్ జోన్ పరిధిలో గణేష్ మండపాలు ఏర్పాటు చేసి నవ రాత్రులు నిర్వహించే నిర్వాహకులతో వరంగల్ పోలీస్ కమిషనర్ శనివారం కమిషనరేట్ కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ముందుగా గణేష్ నవ రాత్రి నిర్వహకులు పాటించాల్సిన నిబంధనలపై పోలీస్ అధికారులు పలు సూచనలు చేశారు. అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. గణేష్ మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు తప్పసరిగా ముందుగా పోలీసుల అనుమతి పొందాల్సి ఉంటుందని. గణేష్ మండపాల నిర్వహకులు పోలీసులు ఇందుకోసం ముందుగా నిర్వహకులు తాము ఏర్పాటు చేసే గణేష్ ప్రతిమ ఎత్తు, ఏర్పాటు చేస్తున్న ప్రదేశం, నిమజ్జనం తేదీ, ప్రదేశం మొదలైన సమాచారంతో తెలంగాణ పోలీస్ శాఖ అధ్వర్యంలో నిర్వహిస్తున్న పోలీస్ ప్రోటోకాల్ వెబ్ సైట్ https://policeportal.tspolice.gov.in ద్వారా మండపాల నిర్వహకులు పూర్తి వివరాలను నమోదుచేసుకోని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న అనంతరం సంబంధిత స్టేషన్ పోలీస్ అధికారులు ఆన్లైన్ ద్వారా అనుమతులు జారీచేస్తారని తెలిపారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లను వినియోగించాలి. మండపాల్లో ఎట్టిపరిస్థితులోను డిజేలను ఏర్పాటు చేయరాదు. గణేష్ ప్రతిమలు ఏర్పాటు చేసే ప్రదేశంలో షెడ్ నిర్మాణంలో మంచి నాణ్యత గల షెడ్ ఏర్పాటు చేసుకోవాలి. విధిగా పాయింట్ పుస్తకం ఏర్పాటు చేసుకోవాలి, పోలీసు అధికారులు తనిఖీకి వచ్చినప్పుడు అందులో వ్రాసి సంతకం చేస్తారు. మండపాల్లో ఏదైనా అనుమానాస్పదంగా బ్యాగులు, ప్లాస్టిక్ సంచులు, వస్తువులు లేదా వ్యక్తులు కనిపించినట్లుయితే తక్షణమే డయల్ 100గాని లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలి. పోలీస్ కమిషనర్ నిర్వాహకులకు సూచించారు. ఈ సమావేశంలో సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, అదనపు డీసీపీ రవి, ఏ. సి. పిలు జితేందర్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, తిరుమల్, నందిరాం నాయక్ తో పాటు స్పెషల్ బ్రాంచ్, స్థానిక ఇన్స్ స్పెక్టర్లు పాల్గొన్నారు.