అక్షర శక్తి,హసన్ పర్తి :హసన్ పర్తి మండలంలోని పెంబర్తి గ్రామంలోని బృహత్ ప్రకృతి వనం ఆవరణలో నాటుదాం ఒక చెట్టు -అమ్మ పేరు మీద అనే కార్యక్రమంలో భాగంగా హన్మకొండ జిల్లా పరిషత్ సీఈఓ విద్యాలత మొక్కలు నాటారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్లాంట్ ఫర్ మదర్, నాటుదాం ఒక చెట్టు- అమ్మ పేరు మీదలో బాగంగా గురువారం హసన్ పర్తి మండలం పెంబర్తి గ్రామంలో సిఇఒ విద్యాలత మొక్కలు నాటి, నీరు పోశారు. ఈ కార్యక్రమంలో హసన్ పర్తి మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి ప్రవీణ్ కుమార్, ఎంపిఒ కరుణాకర్ రెడ్డి, మండల ఏపిఒ విజయలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి హేమలత, టిఎ శివప్రసాద్, ఎఫ్ఎ వల్లాల నరేష్, కారోబార్ చాతల్ల సదానందం, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.