Tuesday, September 10, 2024

రోడ్డు ప్రమాదంలో నిట్ విద్యార్థిని మృతి

Must Read

అక్షరశక్తి, హన్మకొండ: ములుగు మండలం జంగాలపల్లి క్రాస్ రోడ్ వద్ద గురువారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ నిట్ విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ కు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముర్తుజా (హైదరాబాద్), ఉమర్ (హైదరాబాద్) సాయి (హైదరాబాద్), శ్రేయ (విజయవాడ), సుజిత్ (హైదరాబాద్) అనే ఐదుగురికి గాయాలయ్యాయి. మరో విద్యార్థిని తాడేపల్లి నిస్సి సిజు (ఏలూరు – 18 years)- (B.Tech Civil II Year) అనే విద్యార్థిని మృతి చెందారు.వీరంతా బీటెక్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు. గాయాలపాలైన వారిని 108 అంబులెన్స్ లో ములుగు ప్రాంతీయ వైద్యశాలకు తరలించి ప్రధమ చికిత్స అనంతరం వరంగల్ MGM తరలించారు. ఆ తర్వాత నలుగురు విద్యార్థులను రోహిణి హాస్పిటల్ లో చేర్చగా, ఒక విద్యార్థి(సాయి) ని చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img