- విశ్వబ్రాహ్మణ యూత్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఐలాపురం వేణుచారి
- కేయూలో విద్యార్థుల దీక్షకు సంఘీభావం
అక్షరశక్తి, కేయూ క్యాంపస్: కేయూలో కేటగిరీ-2 పీహెచ్‌డీ అడ్మిషన్లలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని, ఇందుకు బాధ్యుడైన వీసీ రమేశ్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని విశ్వబ్రాహ్మణ హెల్పింగ్ సొసైటీ చైర్మన్, విశ్వబ్రాహ్మణ యూత్ అసోసియేషన్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు ఐలాపురం వేణుచారి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు గురువారం కాకతీయ విశ్వవిద్యాలయం ఎస్‌డీఎల్‌సీఈ వద్ద విద్యార్థి నేతలు చేపట్టిన దీక్షకు ఆయన మద్దతు తెలిపారు. పూలదండలు వేసి దీక్షను ప్రారంభించారు. అనంతరం వేణుచారి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఎంతో చారిత్రక నేపథ్యంగల కాకతీయ యూనివర్సిటీలో ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్న ఘటనలు బాధాకరం అన్నారు. కేటగిరీ-2 పీహెచ్‌డీ అడ్మిషన్లలో అ వకతవకలు జరిగాయని శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థి నేతలపై పోలీసుల దాడి శోచనీయం అ న్నారు. ఇప్పటికైనా సమగ్ర విచారణ జరిపి, విద్యార్థులకు తగిన న్యాయం చేయాలని ఆయన కోరారు. లేకపోతే విద్యార్థులతో కలిసి ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. ఆయన వెంట టూవీలర్ మెకానిక్ అసోసియేషన్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు పెద్దోజు వెంకటాచారి, షణ్ముకాచారి, సతీష్‌తోపాటు కేయూ జేఏసీ నేతలు ఉన్నారు.
Must Read