అక్షరశక్తి, కేయూ క్యాంపస్: .కేయూ విద్యార్థి సంఘాల దీక్షకు కేంద్ర మంత్రివర్యులు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థుల న్యాయపరమైన హక్కుల కోసం విసిని ప్రశ్నిస్తే పోలీసుల చేత దాడి చేపించడం దుర్మార్గం అని అన్నారు.సంఘాలు ఏవి అయినా యూనివర్సిటీ విద్యార్థులకు అండగా బీజేపీ ఉంటుందని అన్నారు.దాడికి గురి అయిన విద్యార్థులకు అన్ని రకాలుగా బీజేపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.విద్యార్థులు నాడు తెలంగాణ ఉద్యమంలో కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదని అన్నారు. తెలంగాణ సాధనలో ముఖ్య భూమిక పోషించిన యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం, అవినీతి చేస్తున్న యూనివర్సిటీ అధికారులను వదిలి పెట్టబోమని హెచ్చరించారు. తక్షణమే విసి ని బర్తరఫ్ చేసి విద్యార్థులకు ప్రభుత్వం న్యాయం చేయకుంటె అవసరం అయితే విద్యార్థుల పక్షం బీజేపీ పోరాటం చేస్తుందని అన్నారు. త్వరలో యూనివర్సిటీ విద్యార్థి సంఘాల ప్రతినిధులు ఢిల్లీకి రండి యూజీసీ లో అవసరమైన చర్యలు చేపట్టడానికి బీజేపీ ఉంటదని అన్నారు. SFC విద్యార్థులకు హాస్టల్ వసతి లేక ఇబ్బంది పడుతున్నారని, ఓయూ కి ఇచ్చినట్లు కె.యూ కి కూడా మీరు నిధులు ఇవ్వాలని కోరగా సానుకూలంగా స్పందించారు. అనంతరం దీక్షలో ఉన్న విద్యార్థులకు నిమ్మ రసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.ఈ కార్యక్రమంలో కె.యూ జాక్ నేతలు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.