అక్షరశక్తి, వరంగల్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా జిల్లాలో జలమాయమయ్యే లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఖాళీ చేయించి సమీపంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించడం జరుగుతున్నదని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా తెలిపారు. జిల్లాలోని అన్ని చెరువులు పొంగి పొర్లుతున్నాయని, తహసిల్దారులు, ఇరిగేషన్ అధికారులు ఎంపీడీవోలతో బృందాలు ఏర్పాటుచేసి ఎలాంటి ప్రమాద సంఘటనలు చోటు చేసుకోకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.
జిల్లా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్ 1800 425 3434, మొబైల్ నంబర్ 9154252936 కు
జిడబ్ల్యూఎంసీ లో టోల్ ఫ్రీ నెంబర్ 1800 425 1980, 9701999645, 9701999676 మొబైల్ నంబర్లు ఏర్పాటుచేసి 24 గంటలు పర్యవేక్షిస్తు ఫిర్యాదు అందిన వెంటనే ప్రత్యేక రెస్క్యు బృందాలచే సహాయక చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు.
Must Read