గ్రేటర్ వరంగల్ పరిధి 66వ డివిజన్ హనన్‌పర్తిలోని సుజాత విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో ప్రముఖ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా జాతీయ గణిత దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆకుతోట శాంతారాం కర్ణ శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
అనంతరం నిర్వహించిన సమావేశంలో శాంతారాం మాట్లాడారు. నిత్యజీవితంలో గణితం యొక్క ప్రాముఖ్యత, ఆవశ్యకతను విద్యార్థులకు వివరించారు. శ్రీనివాస రామానుజన్ ప్రపంచ ప్రఖ్యాత గణిత శాస్త్ర వేత్త అని, త్రికోణమితిలో అనేక నూతన సూత్రాలను కనిపెట్టిన మేధావి అన్నారు. కేంబ్రిడ్జి విశ్వ విద్యాలయంలో అనేక పరిశోధనలు చేసి రాయల్ సొసైటీ నుంచి ఫెలోషిప్ సాధించారని గుర్తు చేశారు. విద్యార్థులు గణితాన్ని సంఖ్యలు, అంకెలకు పరిమితం చేయకుండా కృత్యాధార పద్ధతుల్లో నేర్చుకుని నిత్య జీవితాన్ని గణిత భావనలను అన్వయించుకోవాలని సూచించారు.
అనంతరం విద్యార్థులతో గణిత కృతమేలా నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష మంది విద్యార్థులకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో 19 సంవత్స రాలుగా ప్రభుత్వం నిర్వహిస్తున్న టాస్క్ ద్వారా మోటివేషనల్ తరగతులు నిర్వహించిన పాఠశాల పూర్వ విద్యార్థి జన్యు రాజేష్ విచ్చేసి విద్యార్థులకు గణిత భావనలపై అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ గూడూరు లక్ష్మీనారాయణ, ఉపాధ్యాయులు జూపాక నాగరాజు, ఏ వెంకట్, ఎస్ పూర్ణచందర్, పీ వెంకటేశ్వర్లు, ఈ ప్రవీణ్, ఎం రాధాకుమారి, వై అరుణ, కే జోత్న్స, సీహెచ్ సంధ్య, సీహెచ్ సబిత, ఎస్ శృతి, స్వప్న, జీ సంధ్య, జీ దేవిక, టీ మౌనిక తదితరులు పాల్గొన్నారు.