Sunday, September 8, 2024

ఈ నెల 16 నుంచి సాలార్‌జంగ్‌ మ్యూజియం వారోత్సవాలు

Must Read

అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : ఈ నెల 16వ తేదీ నుంచి 21 వరకు వారం రోజుల పాటు ఎలాంటి ప్రవేశం రుసుము లేకుండా సాలార్‌జంగ్‌ మ్యూజియంలోకి ఉచితంగా ప్రవేశం కల్పించనున్నట్లు మ్యూజియం డైరెక్టర్‌ నాగేందర్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 18న దేశవ్యాప్తంగా అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం జరుగుతుందని, ఇందులో భాగంగా సాలార్‌జంగ్‌ మ్యూజియంలోనే వేడుకలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా 16-21వ తేదీ వరకు విభిన్న కార్యక్రమాలను జరుగుతాయని, ఈ సందర్భంగా సందర్శకులకు ఉచితంగా ప్రవేశం కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మ్యూజియం తెరిచే ఉంటుందని, కుటుంబ సమేతంగా తరలివచ్చి కార్యక్రమాలను వీక్షించాలని కోరారు. మ్యూజియంలో లైటింగ్‌, వాతావరణం సందర్శకులను ఆకట్టుకుంటుందని తెలిపారు. భారత స్వాతంత్య్రాన్ని సూచించే 75 వస్తువులతో ప్రదర్శన ఉంటుందని, బిద్రి తయారీపై ఒక రోజు వర్క్‌షాప్‌, ఉపన్యాసం ఉంటుందని తెలిపారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img