Tuesday, September 10, 2024

బొగ్గుల వాగుపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలి

Must Read

అక్ష‌ర‌శ‌క్తి, ములుగు: మారుమూల ఏజెన్సీ ఆదివాసి గ్రామమైన బొగ్గుల వాగుపై హై లెవెల్ వంతెనను నిర్మించాలని ప్రముఖ న్యాయవాది అసైన్డ్ భూమి సమితి(ఏబిస్) వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు కలకోటి మహేందర్ మరియు దళిత బహుజన ఫ్రంట్ (డిబీఎఫ్) జిల్లా అధ్యక్షుడు మాదాసి సురేష్ డిమాండ్ చేశారు. శనివారం ఉధృతంగా ప్రవహిస్తున్న బొగ్గుల వాగును కలకోటి మహేందర్, మాదాసి సురేష్ లు సందర్శించగా వారికి స్థానికులు ఏజెన్సీ మారుమూల గిరిజన గ్రామమైన జగ్గన్నగూడెముకు చెందిన బొగ్గుల వాగుకు పోటెత్తిన వరదలకు గతంలో ఇద్దరు అక్కచెల్లెళ్లు కూడా మరణించారని, అయిప్పటికీ పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు కలకోటి మహేందర్, మాదాసి సురేష్ మాట్లాడుతూ.. వర్షకాలంలో బొగ్గుల వాగు ఉధృతంగా ప్రవహించడంతో మిగతా గ్రామాలతో రాకపోకలు నిలిచిపోయి. ఆదివాసి, గిరిజన జగ్గన్నగూడెం గ్రామానికి బాహ్య ప్రపంచముతో సంబంధాలు తెగిపోతాన్నాయని తెలిపారు. ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులతో పాటు, సీజనల్ జ్వరాల బారిన పడిన రోగులు, ఏమైనా అత్యవసర పరిస్థితి ఏర్పడిన సామాన్య ప్రజానీకం వర్షకాలంలో వాగును దాటలేక ఇబ్బందులు పడుతుంటే పాలకులకు కనబడడం లేదా అని మండిపడ్డారు. గిరిజన ఆదివాసి సామాజిక వర్గానికి చెందిన ధనుసరి సీతక్క మంత్రిగా ఉండి కూడా ఇక్కడ హై లెవెల్ బ్రిడ్జి నిర్మించక పోవడము చోశనీయమని విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, ఉన్నతాధికారులు దృష్టి సారించి వెంటనే బొగ్గుల వాగుపై హై లెవెల్ వంతెన నిర్మించాలని లేనిపక్షంలో దళిత, సామాజిక, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గాంధర్ల సారక్క, గాంధర్ల సూరక్క, రాములు, సాంబయ్య, ఐలయ్య తదితరులు పాల్గోన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img