- ఎమ్మెల్యేలు గండ్ర సత్తెన్న, కేఆర్ నాగరాజు
- నూతన సంవత్సర క్యాలెండర్ల ఆవిష్కరణ
అక్షరశక్తి, హన్మకొండ : అక్షరశక్తి పత్రిక నిత్యం ప్రజల పక్షాన నిలుస్తోందని, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆకాంక్షించారు. అక్షరశక్తి పత్రిక ఆధ్వర్యంలో రూపొందించిన 2024 నూతన సంవత్సర క్యాలెండర్లను తమ కార్యాలయాల్లో శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో అక్షరశక్తి పత్రిక ముందు వరుసలో ఉంటోందని అన్నారు. ఈ సందర్భంగా పత్రికా యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీఆర్ లెనిన్, కాంగ్రెస్ నాయకులు పుల్లూరి బాబూరావు, అక్షరశక్తి పత్రిక ప్రతినిధులు పల్లె రవివంశీమోహన్, దూదికట్ల సర్వేశ్వర్, ముల్క రవి తదితరులు పాల్గొన్నారు. - అక్షరశక్తి క్యాలెండర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్ సిక్తాపట్నాయక్
అక్షరశక్తి, హన్మకొండ : అక్షరశక్తి పత్రిక ఆధ్వర్యంలో రూపొందించిన 2024 నూతన సంవత్సర క్యాలెండర్లను హన్మకొండ కలెక్టరేట్‌లో కలెక్టర్ సిక్తా పట్నాయక్ శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతికా యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అక్షరశక్తి పత్రిక ప్రతినిధులు పల్లె రవివంశీమోహన్, దూదికట్ల సర్వేశ్వర్, ముల్క రవి, జగదీశ్, ఖాదర్‌పాషా, కలెక్టర్ సీసీ కృష్ణమూర్తి, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్ సహ సంచాలకులు డాక్టర్ ఆర్ ఉమారెడ్డి, వ్యవసాయ అధికారి బండి స్వామి తదితరులు పాల్గొన్నారు. - క్యాలెండర్ ఆవిష్కరించిన హన్మకొండ తహసీల్దార్
అలాగే, హన్మకొండ తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ విజయ్‌కుమార్ అక్షరశక్తి పత్రిక నూతన సంవత్సర క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పత్రికా యాజమాన్యానికి అభినందలు తెలిపారు. - క్యాలెండర్ ఆవిష్కరించిన వేణుచారి
అక్షరశక్తి పత్రిక ఆధ్వర్యంలో రూపొందించిన 2024 నూతన సంవత్సర క్యాలెండర్లను విశ్వబ్రాహ్మణ హెల్పింగ్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు, విశ్వబ్రాహ్మణ యూత్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఐలాపురం వేణుచారి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పెద్దోజు వెంకటాచారి, షణ్ముకాచారి, రామాచారి తదితరులు పాల్గొన్నారు. - కార్మికులకు అండగా అక్షరశక్తి పత్రిక
అక్షరశక్తి, హన్మకొండ : ఉద్యోగులు, కార్మికుల సమస్యలపై అక్షరశక్తి పత్రిక నిరంతరం పోరాడుతూ.. అండగా నిలుస్తోందని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్పీడీసీఎల్ కంపెనీ ప్రధాన కార్యదర్శి, ఏడీఈ బక్క దానయ్య, కంపెనీ వైస్ ప్రెసిడెంట్ రౌతు రమేష్ అన్నారు. అక్షరశక్తి పత్రిక ఆధ్వర్యంలో రూపొందించిన 2024 నూతన సంవత్సర క్యాలెండర్లను శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… అక్షరశక్తి పత్రిక మరింతగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు బాబు, కృష్ణ, రవి, ప్రభాకర్, సురేష్, సందీప్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
Must Read