అక్షరశక్తి, పర్వతగిరి : వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామ పంచాయతీ కార్యాలయంలో తపాలా శాఖ ఆధ్వర్యంలో డాక్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాం ను స్థానిక పోస్టుమాస్టర్ బాల్లె రాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నర్సంపేట సబ్ డివిజనల్ ఇన్స్ పెక్టర్ సుచందర్ హాజరై తపాలా శాఖ అందించే సుకన్య, తపాలా బీమ, సుకన్య సమృద్ధి యోజన, చిన్న మొత్తాల పొదుపులు తదితర సేవల గురించి అవగాహన కల్పించారు. అనంతరం జాతీయ జెండాల విక్రయాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ మాధవుడు, పోస్టల్ సిబ్బంది మౌలానా, నసీర్ , రాజు, భగీరథ రెడ్డి, రమణ, వేణు, రవి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు అనిల్ రావు, మాజీ వైస్ ఎంపీపీ రాజేశ్వరరావు, మండల అధ్యక్షుడు శ్రీనివాస్ నాయక్, కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షులు ముదురకోల రమేష్, సంపెల్లి పరమేశ్వరరావు, చిన్నపాక శ్రీనివాస్, కొమురయ్య, రమేష్, వీరాచారి తదితరులు పాల్గొన్నారు.