అక్షరశక్తి, హసన్ పర్తి : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 3వ డివిజన్ పరిధిలోని పైడిపల్లి మధ్యగూడెం గ్రామానికి చెంది తిక్క అంజలి (25), సంగాల దిలీప్ (30) ఆత్మహత్యకు పాల్పడగా మంగళవారం ఎంజీఎం మార్చరీలో వారి మృతదేహాలకు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట 3వ డివిజన్ కార్పొరేటర్ జన్ను శీభారాణి – అనిల్ కుమార్, మండల అధ్యక్షుడు జన్ను సుధాకర్, సీనియర్ నాయకులు జన్ను అరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.