Tuesday, September 10, 2024

గొర్రెకుంట ఉన్నత పాఠశాలకు ఆర్ఓ మినీ వాటర్ ప్లాంట్ అంద‌జేత

Must Read

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 15వ డివిజన్ గొర్రెకుంటలో జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలకు పూర్వ విద్యార్థి కానిస్టేబుల్ నమిండ్ల సాధన్ ఆర్ఓ మినీ వాటర్ ప్లాంట్ ని బహూకరించారు. ఈ సందర్భంగా నమిండ్ల సాధన్ మాట్లాడుతూ మన పాఠశాలలో చదివే విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటూ చక్కగా చదువుకొని ఉన్నత శిఖరాలు ఎదగాలని కోరారు. ఈ సందర్భంగా ప్రధానో పాధ్యాయులు జ్యోతిర్మయి మాట్లాడుతూ చాలా కాలంగా పాఠశాలకు అనేక విధాలుగా స‌హ‌క‌రిస్తున్న‌ సాధన్ సేవలు అభినందనీయం అని కొనియాడారు. ఈ సంద‌ర్భంగా కానిస్టేబుల్ సాధన్‌ను ఉపాధ్యాయులు గ్రామ పెద్దలు సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామపెద్దలు నమిండ్ల క్లిమెంట్, ఎలగొండ ప్రవీణ్, నమిండ్ల కిరణ్, మాచర్ల కార్తీక్, సిలువేరు రవి, ఇంద ఆరోగ్యం, సిలువేరు సుమన్ పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img