అక్షరశక్తి, మడికొండ : వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా అదేశాల మేరకు గ్రేటర్ వరంగల్ మడికొండ- రాంపూర్ ఇండస్ట్రియల్ ఏరియాలో మడికొండ పోలీసులు కమ్యూనిటీ పోలిసింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా తేజస్విని బట్టల షాపులో వర్కర్లకు సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణా, మత్తు పదార్థాలతో కలిగే నష్టాలు, చైల్డ్ లేబర్స్, 100 డయల్ ప్రాముఖ్యత, వివిధ అంశాలపై మడికొండ ఎస్సై రాజబాబు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ జి జయరాజు, కానిస్టేబుల్ రాకేష్, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.