Monday, September 16, 2024

ఆర్ఆర్ఆర్ కు సంబంధించి భూసేకరణ, పనుల పురోగతిపై సీఎం సమీక్ష

Must Read

అక్ష‌ర‌శ‌క్తి డెస్క్: ఆర్ఆర్ఆర్ సంబంధించి భూసేకరణ, పనుల పురోగతిపై ముఖ్యమంత్రి డా. బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. తెలంగాణ సమగ్రాభివృద్ధి లక్ష్యంగా చేపట్టిన రీజినల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం భూసేకరణ పనుల్లో వేగం పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. భూసేకరణ పూర్తి పారదర్శకంగా జరగాలని ఆదేశించారు. ఆర్ఆర్ఆర్ నిర్మాణ పనుల్లో పురోగతిపై సంబంధిత కలెక్టర్లు రోజూవారిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి వివరించాలని పేర్కొన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్), రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) మధ్య అనుసంధానానికి అనువుగా రహదారుల ప్రణాళికలు ఉండాలని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రధాన రహదారులకు అనుసంధానం చేసే ప్రదేశాలను ముందుగానే గుర్తించి నిరంతరం సాఫీగా ప్రయాణాలు సాగేందుకు వీలుగా నిర్మాణాలు ఉండాలని అన్నారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా అలైన్ మెంట్ ఉండాలని చెప్పారు. ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు కానున్న వివిధ రకాల పరిశ్రమలు, సంస్థలకు ఉపయోగకరంగా ఈ మార్గాల ప్రణాళికలు ఉండాలని స్పష్టం చేశారు. ఆర్ఆర్ఆర్ కింద సంగారెడ్డి – భువనగిరి – చౌటుప్పల్ మార్గంలో భూసేకరణ దాదాపుగా పూర్తి కాగా దక్షిణ భాగంలో చౌటుప్పల్ – ఆమ‌న్‌గ‌ల్‌ – షాద్ న‌గ‌ర్‌ – సంగారెడ్డి (189.20 కి.మీ.) మార్గానికి సంబంధించి భూ సేక‌ర‌ణ, అలైన్‌మెంట్‌ అంశాలపై ముఖ్యమంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆ సూచనలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో పర్యటించి సమగ్ర నివేదిక తయారు చేసి త్వరగా అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఆర్ఆర్ఆర్ విషయంలో ఏవైనా సాంకేతిక సమస్యలుంటే వెంటనే కేంద్ర ప్రభుత్వంతో చర్చించాలని చెప్పారు. ఈ సమావేశంలో మంత్రి కొమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు న‌రేంధ‌ర్ రెడ్డి, నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img