Tuesday, June 18, 2024

దేశంలో 3 వేలకు చేరువలో కరోనా రోజువారీ కేసులు

Must Read

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. మంగళవారం 2483 కేసులు నమోదవగా, తాజాగా అవి మూడువేలకు చేరువయ్యాయి. దేశంలో కొత్తగా 2927 మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,30,65,496కు చేరాయి. ఇందులో 4,25,25,563 మంది బాధితులు కోలుకున్నారు. మరో 16,279 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 5,23,654 మంది మహమ్మారికి బలయ్యారు. కాగా, గత 24 గంటల్లో 2252 మంది కోలుకోగా, 32 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

కేంద్ర ఆరోగ్య‌శాఖ వివ‌రాల ప్ర‌కారం… మొత్తం కరోనా కేసుల్లో 0.04 శాతం కేసులు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయని తెలిపింది. రికవరీ రేటు 98.75 శాతం, మరణాలు 1.22 శాతంగా ఉన్నాయని పేర్కొంది. ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 0.58 శాతానికి పెరిగిందని వెల్లడించింది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img