Monday, September 9, 2024

దేవ‌య్య‌కు ఓయూ డాక్టరేట్

Must Read

అక్ష‌ర‌శ‌క్తి, మెద‌క్ : మెద‌క్ జిల్లా పాపన్నపేట మండలం మిన్పూర్ గ్రామవాసి బీ దేవయ్యకు ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్‌ను ప్రధానం చేసింది. అర్థశాస్త్ర విభాగంలో ప్రొఫెసర్ జీ రామకృష్ణ పర్యవేక్షణలో “ఎఫెక్టివ్నెస్ అఫ్ ఎం జి ఎన్ ఆర్ ఈ జి ఏ ఏ కేస్ స్టడీ అఫ్ మెదక్ డిస్ట్రిక్ట్ ష‌ అంశంపై పరిశోధన పూర్తి చేసినందుకు డాక్టరేట్ ను ప్రకటించిన‌ట్లు ఓయూ ఎగ్జామినేషన్ బ్రాంచి అధికారులు తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ, బీఎడ్ పూర్తి చేసిన దేవ‌య్య‌… చిన్న వయసులోనే మిన్పూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా పని చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో మెదక్ జిల్లాలో పలు రకాల కార్యక్రమాలు నిర్వహించి రాష్ట్ర సాధన కోసం క్రియాశీలకంగా పనిచేశారు. అనంతరం ఉన్నత విద్య కోసం హైదరాబాద్ వెళ్లారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అడ్మిషన్ పొందారు. కొన్నాళ్ళు జర్నలిస్ట్ గా కొనసాగారు. తరువాత నాన్న కోరిక మేరకు ఉపాధ్యాయ వృత్తి మీద వున్న ఇష్టంతో ఉపాధ్యాయ వృత్తిలో చేరారు. ప్రస్తుతం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పొడిచన్ పల్లిలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. ఈసందర్భంగా పీహెచ్డీ పట్టా పొందిన దేవ‌య్య‌ను ప్రధానోపాధ్యాయులు కే కిషన్, ఉపాధ్యాయులు, మిన్పూర్ గ్రామస్తులు,స్నేహితులు అభినందించారు. అనంతరం దేవ‌య్య మాట్లాడుతూ… తన పరిశోధన పూర్తయ్యేందుకు స‌హ‌క‌రించిన తల్లిదండ్రులకు, గురువులకు, సహకరించిన స్నేహితులు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img