Tuesday, June 25, 2024

వివేకానంద యూత్ ఆధ్వర్యంలో వైభవంగా దుర్గా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

Must Read

అక్షరశక్తి భీమదేవరపల్లి: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని ములుకనూర్ గ్రామంలో వివేకానంద యూత్ ఆధ్వర్యంలో కొలువుదీరిన దుర్గామాతకు నిర్వాహకులు, భక్తులు అమ్మవారిని రోజుకో రూపంలో అలంకరించి విశేష పూజలు అందిస్తున్నారు. ఈ మేరకు సోమవారం అమ్మవారు గాయత్రీ దేవి అలంకరణలో దర్శనమిచ్చారు. అనంతరం దుర్గామాత విగ్రహానికి పంచామృత అభిషేకాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. వచ్చిన భక్తులు దుర్గామాత సేవలో నిమగ్నమయ్యారు. అనంతరం యూత్ నిర్వాహకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వివేకానంద యూత్ అధ్యక్షులు బైరి రాంబాబు మరియు సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img