Saturday, July 27, 2024

బ్లాక్ మెయిలర్ వద్దు..రాకేషరెడ్డి ముద్దు.

Must Read

మాజీ మంత్రి కొప్పుల

అక్షరశక్తి, పరకాల: కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు ప్రవీణ్ ఓ బ్లాక్ మెయిలర్ అని, ఆయనను గెలిపిస్తే పట్టభద్రులు మరింత మోసానికి గురికావలసి వస్తుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శనివారం పరకాల పట్టణంలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల సన్నాహక సమావేశంలో ఆయన స్థానిక మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. తీన్మార్ మల్లన్న గతంలో ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు తెలంగాణలోని పట్టభద్రులు ఓ నిజాయితీపరుడు గాని నమ్మి ఓట్లు వేశారని ఇప్పుడా పరిస్థితి లేదని కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఆయన నిజస్వరూపాన్ని తెలుసుకున్న తర్వాత తెలంగాణ యువత ఈ ఎన్నికలలో ఆయనను ఓడించాలని పట్టబద్రులు కంకణం కట్టుకున్నట్లు ఆయన తెలిపారు. సభావారీత్యా తీన్మార్ మల్లన్న ప్రజలను మోసం చేసే వాడని ఇలాంటి వ్యక్తిని పట్టభద్రులు ఓటేసి గెలిపిస్తే తెలంగాణ సమాజం మరోసారి మోసపోతుందని కొప్పుల ఈశ్వర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఎన్నో రకాలైన హామీలను గుర్తించి అధికారంలోకి వచ్చిందని ఆయన విమర్శించారు. వాటిని తీర్చలేక ప్రజల విశ్వాసాన్ని పొందలేక కాంగ్రెస్ నాయకత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తుందని ఆయన అన్నారు. హామీలను నెరవేర్చడానికి తెలంగాణ ప్రభుత్వం వద్ద చిత్తశుద్ధి లేదని ఆయన మండిపడ్డారు. గడిచిన 10 ఏళ్ల ప్రభుత్వ హయాంలో తెలంగాణ ప్రజలు ఎంతో సుభిక్షంగా సంతోషంగా ఉన్నారని ఆయన గుర్తు చేశారు అదేవిధంగా బిజెపి బలపరిచిన గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి కి తెలంగాణలో తగిన విధమైన బలం లేదన్నారు. టిఆర్ఎస్ అభ్యర్థి విజ్ఞానవంతుడని సేవా గుణం ఉన్నవాడని ఆయనను పట్టభద్రులు మండలకి పంపితే వారు ఎదుర్కొంటున్న సమస్యలను మండలిలో చర్చించి పరిష్కారం చూపించే విధంగా రాకేష్ రెడ్డి ప్రయత్నం చేస్తాడని అన్నారు. సేవా తత్పరుడిగా మాజీ ముఖ్యమంత్రి చేత గుర్తించబడిన డిఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి అత్యధిక ఓట్లతో విజయం సాధిస్తాడన్నారు. వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాలోని పట్టభద్రులు

ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి తగిన విధంగా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం తీరు పైన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు తీవ్రంగా మండిపడ్డారు. కాలయాపన కోసం ప్రయత్నిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే ఓరుగంటి చందర్ విమర్శించారు పట్టభద్రులు ఈ ఎన్నికలలో టిఆర్ఎస్ బలపరిచిన రాకేష్ రెడ్డికి ఓటు వేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలోపరకాల మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ రే గూరి విజపాల్ రెడ్డి పరకాల మండల నడికూడా మండలం ప్రజాప్రతినిధులు నాయకులు ఆయా మండలాల అధ్యక్షులు దురిశెట్టి చంద్రమౌళి, చింత రెడ్డి మధుసూదన్ రెడ్డి, నాయకులు మేడిపల్లి శోభన్ బాబు, గురిజాపల్లి ప్రకాష్ రావు, మాజీ అధ్యక్షుడు అశోక్ మాజీ చైర్మన్ బండి తోపాటు ఆయా మండలాలకు చెందిన నాయకులతోపాటు పరకాల పట్టణానికి కౌన్సిలర్లు నాయకుల పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img