అక్షరశక్తి, పరకాల : పరకాల మండలం కామారెడ్డిపల్లిలో విద్యుత్ తీగలు తగిలి కొలుగూరి రాధకు చెందిన ఇల్లు పూర్తి దగ్ధమైంది. ఇంటి లోపల ఉన్న సామాన్లు, బట్టలు, సర్టిఫికెట్లు, డబ్బులు పూర్తిగా కాలిపోయాయి. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.