అక్షరశక్తి సుబేదారి: అంతర్రాష్ట్ర ఘరానా మోసాలకు పాల్పడుతున్న ముఠాను ఎట్టకేలకు గురువారం రోజున సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు నిమిత్ కపాసి@అమిత్ కుమార్ షా, సుమన్ కపాసి@కాసోజు జయ వీరు ఇద్దరు కలిసి వివిధ కంపెనీలలో పెట్టుబడి పేరుతో కోట్ల రూపాయలు కాజేశారు. ఇతర రాష్ట్రాల్లో విశాఖపట్నం పూణే హైదరాబాద్ వరంగల్ వివిధ నగరాలలో అమాయకులైన ప్రజలను నకిలీ (సిబిఐ, బ్యాంకు మేనేజర్ ఐడెంటి కార్డు లు )ఐడెంటి కార్డులు, ఎస్ కార్డులు చూపిస్తూ, హిందీ, ఇంగ్లీష్, గుజరాతి, బెంగాలీ, భాషలలో అనర్గలంగా మాట్లాడుతూ అమాయకులను పరిచయం చేసుకొని షేర్ మార్కెట్లో వివిధ కంపెనీలలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ బాధితుల నుండి కోటి 34 లక్షల రూపాయలు వసూలు చేశారు. తాజాగా జులైవాడకు చెందిన సయ్యద్ రియాజ్ అను వ్యక్తి ప్రవీణ్ కుమార్ లను స్పీకింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, మాట్రిమోనీ, ఓవర్సీస్ కన్సల్టెన్సీ, బ్యాంకు లోన్స్, లో ఉద్యోగాలు ఇప్పిస్తానని కొంత డబ్బును తెలివిగా వసూలు చేసి, పారిపోతుండగా సుబేదారి ఇన్స్పెక్టర్ పి.సత్యనారాయణ రెడ్డి, టాస్క్ ఫోర్స్ సిబ్బంది తో కలిసి అరెస్టు చేశారు..
నిందితుల వివరాలు..
1)నిమిత్ కెపాసి@ అమిత్ కుమార్, s /o రసికలాల్ కపాసి, వయసు 47 సంవత్సరాలు, కులం గుజరాతి, వృత్తి :బిజినెస్, r/o రవీంద్ర సర అని లైన్ నియర్ సర్జీ మార్కెట్ కలకత్తా పశ్చిమబెంగాల్..
2) సుమన్ కాపాసి@కాసోజు జయ w/o నిమిత్ కపాసి, వయస్సు 42 కులం : ఔసల, వృత్తి ప్రైవేట్ ఎంప్లాయ్..r/o సాయి నగర్ కాలనీ హనుమకొండ..
N/o ఈ సమయా బజార్ కోటి బస్టాండ్ హైదరాబాద్..
నిందితుల వద్ద నుండి నకిలీ సీబీఐ ఐడెంటి కార్డు, ప్రెస్ కార్డ్, యూనియన్ బ్యాంక్ మేనేజర్ ఐడెంటి కార్డు,
నకిలీ ఆధార్ కార్డు, పాన్ కార్డ్, గోల్డ్ రింగ్, నకిలీ బ్యాంకు చెక్కులు, మరియు 7800రూపాయల నగదును పోలీసులు స్వాధీన పరుచుకున్నారు.