అక్షరశక్తి, మహబూబాబాద్: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తండాలు నీటిలో మునిగి సామాన్య ప్రజలు తల్లడిల్లుతున్న నేపథ్యంలో మహబూబాబాద్ పోలీస్‌లు వారికి అండగా నిలిచారు.. రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడుతూ బిక్కు బిక్కు మంటున్న తండా వాసులకు మేమున్నమని దైర్యం నీ ఇవ్వడం తో పాటు స్వయంగా వారిని అక్కున చేర్చుకుని.. సురక్షిత ప్రాంతాలకు తరలించారు.. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం సీతారాం తండా వాసులు 100మంది వరద ధాటికి ఇండ్లల్లలో నీరు చేరి ఇబ్బందులు పడుతున్నారన్న సమాచారం తెలుసుకున్న సీరోల్ ఎస్ఐ నగేష్ నేతృత్వంలోని పోలీసుల బృందం తండాకు చేరుకొని వారిని రక్షించారు.. తన సిబ్బందితో పాటు జోలె కట్టుకొని ఓ వృద్ధురాలిని సురక్షిత ప్రాంతానికి చేర్చిన ఎస్ఐ నగేష్ ను తండా వాసులు అభినందిస్తున్నారు.