- స్వీకరణ, సమర్పణపై గ్రేటర్ వరంగల్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా సూచనలు
▪️అభయహస్తం 6 గ్యారంటీల కొరకు కుటుంబం నుండి ఒకే దరఖాస్తు మాత్రమే సమర్పించాలి.
▪️ బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్ తీసిన ఫారం ద్వారా కుడా దరఖాస్తు చేసుకోవచ్చు
▪️ప్రజలు జీడబ్ల్యూఎంసీ పరిధిలోని 66 డివిజన్లలో ఏ డివిజన్ కేంద్రంలోనైనా పూర్తి చేసిన దరఖాస్తులు అందజేయవచ్చు.
▪️జిరాక్స్ ఫారంతో సమర్పించిన దరఖాస్తులు పథకాలు అందజేయడంలో పరిగణలోకి తీసుకోబడుతాయి..
▪️వదంతులు నమ్మవద్దు
▪️ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇంటింటికీ వెళ్లి దరఖాస్తు ఫారాలు అందజేయడం గాని, స్వీకరించడం గానీ జరగదు.
▪️వరంగల్ మహానగర వ్యాప్తంగా 66 డివిజన్లలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో పూర్తి సమాచారంతో నింపిన దరఖాస్తులు సమర్పించి, రసీదు (అక్నాలెడ్జి మెంట్ )పొందాలి.
▪️డిసెంబర్ 28 నుండి జనవరి 6 వరకు వారం రోజుల పాటు గ్రేటర్ వరంగల్ లోని 66 డివిజన్లలో దరఖాస్తుల స్వీకరించబడును. (డిసెంబర్ 31, జనవరి 1 సెలవు రోజులు మినహా)
▪️ రేషన్ కార్డు ఉంటేనే దరఖాస్తు చేయాలి అనే నిబంధన ఏమి లేదు, ఆధార్ కార్డ్ జిరాక్స్ ద్వారా కూడా దరఖాస్తు చేయవచ్చు
▪️వదంతులు నమ్మి ప్రజలు ఆందోళన కు గురికావద్దు, ప్రజలు అందజేసే ప్రతి దరఖాస్తును స్వీకరిస్తాం.
▪️దరఖాస్తుదారుల నుండి జిరాక్స్ కేంద్రాల యాజమాన్యాలు పెద్ద మొత్తం లో డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకొవడమే కాకుండా కేసులు నమోదు చేస్తాం.
ఇట్లు…..
కమిషనర్
గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్.