Tuesday, September 10, 2024

ఎస్సి గురుకులాల్లో బ్రహ్మకుమారి సంస్థతో ఒప్పందం రద్దు చేసుకోవాలి

Must Read

లేకుంటే డిఎస్ఎస్ భవన్ ముట్టడిస్తాం…

అక్షర శక్తి, హాసన్ పర్తి : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ సి గురుకులాల్లోని విద్యార్థుల మానసిక ఒత్తిల్లను తగ్గించేందుకు బ్రహ్మకుమారి సంస్థతో ట్రైనింగ్ క్లాసులు ఇప్పించే ఆలోచనను గురుకుల కార్యదర్శి డాక్టర్ వి ఎస్ అలుగు వర్షిణి వెంటనే వెన‌క్కి చేసుకోవాలని, తెలంగాణ గురుకులాల, ప్రగతిశీల తల్లితండ్రుల సంఘం (పి పి ఎల్) రాష్ట్ర కన్వనర్ చాతల్ల సదానందం అన్న‌రు. లేకుంటే గురుకులాలను తల్లితండ్రుల ఆధ్వర్యంలో డిఎస్ఎస్ భవన్ ముట్టడిస్తామని చాతల్ల సదానందం హెచ్చరిచిరు. మాపిల్లలకు సైకాలేజీ క్లాసులు కాదు సైకాలేజీ ఉపాధ్యాయులు కావాల‌ని, బ్రహ్మకుమారి సంస్థ ఒప్పందం వద్దు కోడింగ్ లాంటి విద్య కావాల‌ని, ఎస్సీ గురుకులాలలో సి బి ఎస్ సి సిలబస్ అందించాల‌ని, ఎస్ సి,ఎస్ టి, బి సి మైనార్టీ, జనరల్, కె జి బి వి లలో లేని బ్రహ్మకుమారి సంస్థ ఒప్పందం కేవలం సాంఘీక సంక్షేమ గురుకులాల్లోనే ఎందుకు? ఇది ఆర్ ఎస్ ఎస్ భావాలు ఎస్సీ విద్యార్థులకు అందించేటందుకు అలుగు వర్షిని ముసుగులో సీఎం రేవంత్ రెడ్డి కుట్రలో భాగం. ఎస్సి గురుకులలాల్లో హెల్త్ ప్రొఫైల్ గత కార్యదర్శులు ఉన్నప్పటి నుండే హెల్త్ కమాండ్ ద్వారా ప్రొఫైల్స్ ఉన్నవి, మళ్లీ ప్రత్యేకంగా కొత్తవి ఏంటివి.? అలుగు వర్షిని ఐఏఎస్ ఎస్సీ గురుకుల కార్యదర్శిగా జాయిన్ అయినప్పటి నుండి, సోషల్ వెల్ఫేర్ లో ఉన్న కోడింగ్ ఇంటర్నెట్ తొలగించారు. ఫైన్ నాట్స్ లో ఉన్న ఇంటర్ కళాశాల తొలగించారు. సోషల్ వెల్ఫేర్ లో రాష్ట్రవ్యాప్తంగా సెకండ్ హిందీ టీచర్లను తొలగించారు. సి ఒ ఈ లలో ఉన్న కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ( సీ ఓ ఈ ) అసోసియేట్స్ టీచర్స్ ర్యాంకులు తీసుకొస్తుంటే, సి ఒ ఈ అసోసియేషన్ కూడా తొలగించారు. పెంచిన మిస్ చార్జీలను అమలు చేయలేదు. అదే విధంగా మూడు నెలలుగా కుకింగ్ వారికి బిల్లులు ఇవ్వలేదు. టీచర్స్ రిక్రూట్మెంట్ సక్రమంగా లేదు. స్పోర్ట్స్ జయింట్ సెక్రెటరీ ని తొలగించారు. పాఠశాల కళాశాలలో స్పోర్ట్స్ మెటీరియల్ లేదు. పాఠశాలల విజిటింగ్స్ 11, మంచి నాణ్యమైన భోజనం సన్న బియ్యం లేవు. శానిటేషన్ సక్రమంగా లేవు. 12,గురుకులల కు సొంత బిల్డింగ్ లేవు. ఇన్ని సమస్య వలయంలో సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల కళాశాలలో ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఉండి కనీసం సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ లేడు. ప్రజలకు దగ్గరలో ఉండే ప్రజ పాలన ఇదేనా? దూరంగా ఉండే పాలన జోనల్ వ్యవస్థను తీసుకొచ్చారు. రాష్ట్ర, దేశ ప్రజల వద్దకు పాలన చూశాం కానీ ప్రజలకు దూరంగా ఉండే ప్రజా పాలన ఎందుకు అని తెలంగాణ గురుకులాల, ప్రగతిశీల తల్లితండ్రుల సంఘం (పి పి ఎల్) రాష్ట్ర కన్వనర్ చాతల్ల సదానందం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img