ఇచ్చిన మాట నిలబెట్టుకున్న బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
అక్షరశక్తి నర్సంపేట: వరంగల్ జిల్లా చెన్నారావు పేట మండలం లోని చింతల తాండ గ్రామంలో వారం రోజుల క్రితం ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన గిరిజన కుటుంబాన్ని ఆదుకునేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందుకు వచ్చారు. ప్రేమోన్మాది నాగరాజు చేసిన దాడిలో తల్లితండ్రులిద్దరూ శ్రీనివాస్, సుగుణ చనిపోవటంతో ఆ కుటుంబంలోని ఇద్దరు పిల్లలు దీపిక, మదన్ లు అనాథలయ్యారు. దాడి ఘటనలో ఇద్దరు పిల్లలు కూడా తీవ్రంగా గాయపడి చికిత్స అనంతరం కోలుకున్నారు. చనిపోయిన దంపతుల పిల్లలిద్దరిని మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి కేటీఆర్ వద్దకు తీసుకెళ్లారు. దీపికా, మదన్ ల చదువు బాధ్యత తానే స్వయంగా తీసుకుంటానని కేటీఆర్ హామీ ఇచ్చారు. హత్యకు గురైన పిల్లల తల్లి సుగుణ బీఆర్ఎస్ క్రియాశీల కార్యకర్త. పార్టీ తరఫున కుటుంబాన్ని ఆదుకునేందుకు రూ. 5 లక్షలు ఆర్థిక సహాయాన్ని వారి కుటుంబ సభ్యులకు అందించిన నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నర్సంపేట నియోజకవర్గ నాయకులు, చెన్నారావుపేట మండల నాయకులు, క్లస్టర్ బాధ్యులు పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.