Friday, July 26, 2024

మేమే కొంటాం..

Must Read
  • యాసంగి ధాన్యం కొనుగోలుపై సీఎం కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం
  • ఆరు ప్రైవేటు యూనివర్సిటీలకు కేబినెట్ అనుమతి
  • 111 జీవోను రద్దు చేయాలని మంత్రివ‌ర్గం తీర్మానం
    తెలంగాణలో యాసంగి ధాన్యాన్ని మొత్తం ప్ర‌భుత్వ‌మే కొనాల‌ని నిర్ణయించింది. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో మంగళవారం తెలంగాణ కేబినెట్‌ సమావేశం ముగిసింది. ఈ స‌మావేశంలో పలు కీలక అంశాలపై సీఎం, మంత్రులు చర్చించి ప‌లు నిర్ణ‌యాలు తీసుకున్నారు. యాసంగిలో రైతులు పండించిన పంటను పూర్తిస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని కేబినెట్ భేటీ అనంతరం సీఎం కేసీఆర్ తెలిపారు. దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మేరకు నష్టం వస్తుంది ? ప్రభుత్వం ఎంత నష్టం భరించాల్సి ఉంటుందనే దానిపై నలుగురు నిపుణులతో కమిటీ కూడా వేయబోతున్నట్టు తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఈ కమిటీ వేశామని కేసీఆర్ తెలిపారు.
  • ఆరు ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతి
  • తక్కువ నష్టంతో ధాన్యం కొనుగోలుతో పాటు దాన్ని డిస్పోజ్ చేసేందుకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే దానిపై కమిటీ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. మూడు నాలుగు రోజుల వ్యవధిలోనే మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. రైతులు తక్కువ ధరకు ధాన్యాన్ని ఎవరికీ అమ్ముకోవద్దని సూచించారు. అదేవిధంగా కేసీఆర్ గతంలో ప్రకటించిన విధంగా 111 జీవోను రద్దు చేయాలని కేబినెట్ తీర్మానం చేసింది. దీంతో పాటు ఆరు ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది.
- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img