అక్షరశక్తి, హన్మకొండ : భద్రకాళి దేవాలయంలో భద్రకాళీ వీరభద్రేశ్వర కళ్యాణం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమంలో మొదటి రోజు మంగళవారం మున్నూరు కాపు కులస్తులు అంకురార్పణ కార్యక్రమం నిర్వహించారు. చీఫ్ విప్ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షులు కటకం పెంటయ్య, బక్కి రాజ్ కుమార్, పాటి శ్రీనివాస్, కనుకుంట్ల రవికుమార్, తోట ప్రకాశ్, తోట వెంకన్న, తోట తిరుమల్, మందాటి మనోజ్ కుమార్, బక్కి వేణుగోపాల్, మీరుకుల మనోహర్, పూజారి సత్యనారాయణ, తోట విజయలక్ష్మి, వారిమడ్ల లత, పేరుకారి శ్రీధర్, వీరన్న, కృష్ణమూర్తి, జంగిలి సుధాకర్, తుల రమేష్ తదితరులు పాల్గొన్నారు.