Tuesday, June 18, 2024

శాఖాహారం.. మాంసాహారం.. ఏది మంచిది?

Must Read

ప్ర‌కృతి వైద్య‌నిపుణులు చిలువేరు సుద‌ర్శ‌న్

ఆరోగ్యానికి శాఖాహార‌మే మేల‌ని ఇప్పుడిప్పుడే శాస్త్ర‌జ్ఞులు తెలుసుకుంటున్నారు. శాఖాహారంలో రోగ‌నిరోధ‌క శ‌క్తి ఉంది. అన్నిర‌కాలైన విట‌మిన్స్‌, ప్రొటీన్స్‌, క్రొవ్వు ప‌దార్థాలు శాఖాహారంలోనే ఉన్నాయి. ముఖ్యంగా శాఖాహారం మ‌ల‌బ‌హిష్క‌ర‌ణ‌కు తోడ్ప‌డుతుంది. మాంసాహారం వ‌ల‌న మ‌ల‌బ‌ద్ధ‌కం ఏర్ప‌డుతుంది. శ‌రీరంలో గ్యాసెస్ త‌యార‌వుతాయి. బ్యాక్టీరియా, క్రిములు పుడ‌తాయి.

త‌ద్వారా రోగాలు వ‌స్తాయి. కాబ‌ట్టి మాంసాహారం క‌న్నా శాఖాహార‌మే మేలు. అందుకు శాఖాహారం విలువ తెలుసుకుని బ్రిటిష్‌, అమెరికా దేశ‌స్తులు మాంసాహారం విడిచి శాఖాహారం తింటున్నారు. కానీ.. మ‌న భార‌తీయులు శాఖాహారం వ‌దిలి మాంసాహారం తింటున్నారు. ప్ర‌పంచంలోని చాలామంది మేధావులు, శాస్త్ర‌జ్ఞులు, పండితులు, మ‌హాత్ములు శాఖాహారులేకాని మాంసాహారులు కారు. దీనిని బ‌ట్టి శాఖాహారుల మెద‌డు బాగా ప‌నిచేస్తుంద‌ని, మాంసాహారుల మెద‌డు మొద్దుబారిపోతుంద‌ని అర్థం చేసుకోవ‌చ్చు. కాబ‌ట్టి ఈరోజు నుంచే మాంసాహారం మాని శాఖాహారులు కండి.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img